అక్టోబర్ 12.. డేంజర్ డేట్ : చరిత్ర పునరావృతమా? పాకిస్థాన్‌లో మరో సైనిక తిరుగుబాటు!
పాకిస్థాన్‌లో చరిత్ర పునరావృతమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ 12వ తేదీ వస్తుందంటే పాకిస్థాన్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గత చరిత్రను పరికిస్తే ఇదేవిషయం అవగతమవుతోంది.
పాకిస్థాన్‌లో చరిత్ర పునరావృతమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ 12వ తేదీ వస్తుందంటే పాకిస్థాన్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గత చరిత్రను పరికిస్తే ఇదేవిషయం అవగతమవుతోంది.
1999, అక్టోబరు 12వ తేదీన తాను నియమించిన ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫే తనను కూల్చి గద్దెనెక్కాడు. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులే నెలకొని ఉండటంతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. మరో సైనిక తిరుగుబాటు జరిగే అవకాశం ఉందన్న వార్తలు ఆయనకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నట్టు స్థానిక మీడియా కథనాల సమాచారం.
యురీ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది. దీనికి ప్రతీకారం తీర్చుకునే దిశగా పాక్ ఆర్మీ వ్యూహాలు రచిస్తుంటే.. షరీఫ్ మాత్రం ఉగ్ర సంస్థలపై చర్యకు ఆదేశించారు. ఇది పాక్ ప్రభుత్వానికి, ఆ దేశ ఆర్మీకి తీవ్ర విభేదాలు సృష్టించింది. ఫలితంగా, ప్రస్తుత ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్, ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకొనడంతో ఇప్పుడు కూడా మరో సైనిక తిరుగుబాటు జరిగే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
పైగా.. రహీష్ షరీఫ్ పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. అదేసమయంలో ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను బేరీజు వేసుకున్న ఆయన.. తిరుగుబాటు దిశగా పావులు కదుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే... మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఇటీవల చెప్పినట్టుగా పాకిస్థాన్‌కు ప్రజాస్వామ్యం ఏమాత్రం అచ్చిరాదని తేలిపోతుంది.