శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 నవంబరు 2019 (18:37 IST)

గూగుల్ సంస్థలో వేధింపులు... మూకుమ్మడి నిరసనకు దిగిన ఉద్యోగులు

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌ సంస్థలో వేధింపులు ఎక్కువయ్యాయట. ఇద్దరు ఉద్యోగులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటికి పంపించింది. దీంతో మిగిలిన ఉద్యోగులు శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయం ఎదుట మూకుమ్మడి నిరసనలకు దిగారు. 
 
హైదరాబాద్‌లో గూగుల్ కార్యాలయంలో ఉన్న విషయం తెల్సిందే. ఈ సంస్థ యాజమాన్యంపై అసంతృప్తితో ఉద్యోగులు నిరసనకు దిగారు. ఉద్యోగులను అణచివేస్తున్నారని ఆరోపించారు. 
 
తాజాగా ఇద్దరు ఉద్యోగులను సెలవుపై పంపడంపై సహచర ఉద్యోగులు శాన్ ఫ్రాన్సిస్కోలోని కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. సుమారు 200మంది ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
 
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇద్దరు ఉద్యోగులను సెలవుపై వెళ్లమనడం ఏమిటని ఉద్యోగులు గూగుల్ యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. వారిని తక్షణమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ నెల ప్రారంభంలో సదరు ఉద్యోగులు కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడంతో వారిని సెలవుపై పంపినట్లు గూగుల్ ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. 
 
మరోవైపు ఓ మహిళా ఉద్యోగిని సంస్థలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని చెపుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని తెలిపినట్లు సమాచారం.