మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 అక్టోబరు 2019 (11:43 IST)

రోగులకు కూడా పెన్షన్.. ఆస్పత్రిలో ఉంటే రోజు కూలి.. ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తనదైనముద్రను చూపిస్తున్నారు. ముఖ్యంగా, పేద ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వారిని అన్ని విధాలుగా ఆదుకుని, ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు కొత్తకొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారు. తాజాగా రోగులకు కూడా పెన్షన్ ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ సుస్తి చేసి ఆస్పత్రిలో ఉన్నా రోజుకు కూలీ కూడా ఇవ్వనున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తుల పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మానవత చూపించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారందరికీ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, సివియర్ హెమోఫీలియా వ్యాధి గ్రస్తులకు నెలకు రూ.10 వేలు పెన్షన్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. 
 
ఇదేసమయంలో బిలాటరల్ ఎలిఫాంటరియాసిస్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, మంచం పట్టిన పక్షవాత రోజులు, ప్రమాదాల బాధితులకు రూ.5 వేల చొప్పున నెలవారీ సాయం చేయాలని ఆయన నిర్ణయించారు. జనవరి 1 నుంచి ఈ పెన్షన్లు అమలుకానున్నాయి. ఈలోగా లబ్దిదారుల ఎంపిక జరుగనుంది. దేశంలోనే ఈ తరహా వ్యాధిగ్రస్థులకు పెన్షన్ మంజూరు తొలిసారని అధికారులు అంటున్నారు. 
 
కాగా, ఈ సందర్భంగా పోస్ట్ ఆపరేషన్ అలవెన్స్ ను కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీని కింద ఏదైనా ఆపరేషన్ జరిగిన తర్వాత ఆసుపత్రిలో ఉన్న సమయంలో రోజుకు రూ.225 చొప్పున రోగులకు చెల్లిస్తారు. ఈ ఉత్తర్వులు డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.