మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 4 మార్చి 2023 (13:48 IST)

పాకిస్తాన్‌లో 10 గ్రాముల ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

gold
రికార్డు స్థాయిలో అధిక ద్రవ్యోల్బణంతో పాకిస్తాన్ దేశం కొట్టుమిట్టాడుతోంది. దేశంలో అనేక వస్తువుల ధరలు చుక్కలను చూస్తున్నాయి. డీజిల్ ధర లీటరు 280 రూపాయలకు చేరుకుంది. మిగిలి వస్తువులు వేటికవే విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనితో పాకిస్తాన్ దేశంలోని ప్రజలు అల్లాడిపోతున్నారు. పాకిస్తాన్ దేశంలో ఇప్పుడు బంగారానికి కూడా రెక్కలు వచ్చాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే దేశ కరెన్సీ భారీగా పతనమైపోయింది. జియో టీవీ వెబ్‌సైట్ ప్రకారం, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా 2.06 లక్షల రూపాయలకు చేరుకుంది.
 
పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంక్ గురువారం కీలక వడ్డీ రేటును 300 బేసిస్ పాయింట్లు పెంచింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ కీలక రేటు ఇప్పుడు 20% వద్ద ఉంది. పాకిస్తాన్ దేశంలోని కరెన్సీ యూఎస్ డాలర్‌తో పోలిస్తే 280 కంటే ఎక్కువ పడిపోయింది.