శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (10:16 IST)

ఉత్తర కొరియాలో తీవ్ర ఆహార కొరత.. కిమ్ సమీక్ష

north korea president kim
ఉత్తర కొరియా-దక్షిణ కొరియా మధ్య చాలా ఏళ్లుగా సరిహద్దు సమస్య కొనసాగుతుండగా, దక్షిణ కొరియా మాత్రం అమెరికా అగ్రరాజ్యం స్నేహ హస్తం కలిగి ఉంది.
 
ఇరు దేశాలు ఇటీవల సైనిక విన్యాసాలు నిర్వహించాయి. దీంతో ఆగ్రహించిన ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష నిర్వహించింది. గత ఏడాది కాలంలో 70 క్షిపణి పరీక్షలు నిర్వహించింది. 
 
తదనంతరం, యునైటెడ్ స్టేట్స్, ఇతర ప్రపంచ దేశాలు ఉత్తర కొరియాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి దీంతో ఉత్తర కొరియాలో తీవ్ర ఆహార కొరత ఏర్పడిందని, చాలా మంది ఆకలితో చనిపోయారని చెబుతున్నారు.
 
ఉత్తర కొరియా అణ్వాయుధాల కోసం విపరీతంగా డబ్బు ఖర్చు చేయడం, బాలిస్టిక్ క్షిపణి పరీక్షల నుండి నిషేధించబడినందున ఉత్తర కొరియా నేడు క్లిష్ట పరిస్థితిలో ఉందని సమాచారం. ఈ ఆహార కొరతపై అధ్యక్షుడు కిమ్ సమీక్ష నిర్వహిస్తున్నారు.