మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 జనవరి 2017 (08:12 IST)

నా జీవితంలో ఎన్నడూ చూడని చెత్త ఫొటో అది... సీఎన్ఎన్‌కు ట్రంప్ చురకలు

ప్రముఖ ఇంగ్లీష్ వార్తా సంస్థ సీఎన్ఎన్‌కు అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ చురకలు అంటించారు. ఆ సంస్థ విడుదల చేసిన ‘అన్‌ప్రెసిడెంటెడ్‌’ అనే పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ పుస్తకం కవర్

ప్రముఖ ఇంగ్లీష్ వార్తా సంస్థ సీఎన్ఎన్‌కు అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ చురకలు అంటించారు. ఆ సంస్థ విడుదల చేసిన ‘అన్‌ప్రెసిడెంటెడ్‌’ అనే పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ పుస్తకం కవర్ పేజీపై ఓ పాత ఫోటోను ముద్రించింది. దీనిపై డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. 
 
‘సీఎన్‌ఎన్‌ ఇటీవలే అన్‌ప్రెసిడెంటెడ్‌ అనే ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. దీనిలో 2016 ఎన్నికలు, విజయానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. బాగా కృషి చేశారనే అనుకుంటున్నా.. కానీ దీని కవర్‌పేజీకి వినియోగించిన నా ఫొటో అస్సలు బాగోలేదు. నా జీవితంలో ఎన్నడూ చూడని చెత్త ఫొటో అది’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
ఈ పుస్తకానికి రెండు వెర్షన్‌లు ఉన్నాయి. తొలిపరిచయ ముద్రణలో బాగా ఉన్న ట్రంప్‌ ఫొటోను వాడారు. మరో ఎడిషన్‌లో మాత్రం ట్రంప్‌ ఫొటోల కొలాజ్‌ను వాడారు. దీనిలో ట్రంప్‌ వేదికపై మాట్లాడుతున్న ఒక ఫొటోను కూడా వాడారు. వీటిల్లో ఏ ఫొటోను ఉద్దేశించి ట్రంప్‌ వ్యాఖ్యానించారో తెలియరాలేదు.