1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (13:01 IST)

భారత్ - పాకిస్థాన్ చర్చల్లో తలదూర్చనున్న డోనాల్డ్ ట్రంప్?

దశాబ్దాల కాలంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి కారణం కాశ్మీర్ అంశమే. అయితే, ఈ సమస్య పరిష్కారం కోసం ఇరు దేశాలు కృషి చేస్తూనే ఉన్నాయి. పలు దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి క

దశాబ్దాల కాలంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి కారణం కాశ్మీర్ అంశమే. అయితే, ఈ సమస్య పరిష్కారం కోసం ఇరు దేశాలు కృషి చేస్తూనే ఉన్నాయి. పలు దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా సూచనలు కూడా చేసింది. అయితే, ఈ రెండు దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గంగా కనిపిస్తోంది. కానీ ఇందుకు పాకిస్థాన్ ముందుకు రావడం లేదు. ఫలితంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ మొదలైతే మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి అయిన నిక్కీ హేలీ చెప్పారు. ఇరు దేశాల మధ్య చర్చల్లో పాల్గొనడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడంలో అమెరికా తన వంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఇరు దేశాల మధ్య చర్చల్లో అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా పాల్గొన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారు.