ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (18:04 IST)

కారణం లేకుండానే కొడతారట.. ఎనిమిదేళ్ల కుర్రాడు ఏం చేశాడంటే..?

తల్లిదండ్రుల బంధం ప్రస్తుతం చిన్నారులకు ఏమాత్రం అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు ఉద్యోగాల కోసం గంటల తరబడి ఆఫీసులకే పరిమితం కావడం.. ఇంటికొచ్చినా ఫోన్లు, టీవీలతో గడపటం కారణంగా చిన్నారులకు స్మార్ట్ ఫోన్ల యుగంలో తల్లిదండ్రుల ప్రేమ కరువైపోతోంది. ఇలా తల్లిదండ్రులు ఎలాంటి కారణం లేకుండా తరచూ తమ ఎనిమిదేళ్ల కుమారుడిపై చేజేసుకోవడం.. ఘోరానికి దారితీసింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఉక్రెయిన్‌కు చెందిన తల్లిదండ్రులు ఎనిమిదేళ్ల కుమారుడిని తరచూ కొట్టడం, కారణం లేకుండా తిట్టడం వంటివి చేస్తుండేవారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ చిన్నారి తొమ్మిదో అంతస్థు నుంచి కిందకి దూకాడు. 
 
ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన ఆ చిన్నారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ ఆ చిన్నారి చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిన్నారి ఆత్మహత్యకు పాల్పడిన రోజు.. దుస్తులు చినిగి వుందనే కారణంగా తల్లిదండ్రులు చేజేసుకున్నారని విచారణలో తేలింది.