శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 20 మే 2018 (10:06 IST)

భర్తతో విబేధాలు.. బిడ్డతో కలిసి 25వ అంతస్తు నుంచి దూకేసిన స్టెఫానీ..

భార్యాభర్తల మధ్య విబేధాలు ఓ తల్లీకుమారుడి ఆత్మహత్యకు దారితీసింది. భర్తతో విబేధాల కారణంగా అమెరికాకు చెందిన ప్లేబోయ్ మాజీ మోడల్ స్టెఫానీ ఆడమ్స్(45) తన ఏడేళ్ల కుమారుడు విన్సెంట్‌తో కలిసి ఆత్మహత్యకు పాల్ప

భార్యాభర్తల మధ్య విబేధాలు ఓ తల్లీకుమారుడి ఆత్మహత్యకు దారితీసింది. భర్తతో విబేధాల కారణంగా అమెరికాకు చెందిన ప్లేబోయ్ మాజీ మోడల్ స్టెఫానీ ఆడమ్స్(45) తన ఏడేళ్ల కుమారుడు విన్సెంట్‌తో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.


వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్‌లోని ఓ హోటల్ 25వ అంతస్తు నుంచి స్టెఫానీ ఆడమ్స్.. తన ఏడేళ్ల కుమారుడు విన్సెంట్‌తో కలిసి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడి విషయంలో భర్త చార్లెస్ నికోలయ్‌తో స్టెఫానీకి వున్న విభేదాలే ఈ ఆత్మహత్యకు దారితీసిందని పోలీసులు వెల్లడించారు. 
 
గోథమ్ హోటల్ 25వ అంతస్తు పెంట్‌హౌస్‌లోని కిటికీ నుంచి ఆమె కిందకు దూకినట్లు హోటల్ సిబ్బంది తెలిపారు. రెండో అంతస్తు బాల్కనీలో పడిన తల్లీ కుమారుడు తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వివరించారు. యూరప్‌కు తన కుమారుడిని తీసుకెళ్తానని మాజీ భర్త చెప్పడంతో స్టెఫానీ తీవ్ర ఆవేదనకు గురైందని ఆమె స్నేహితులు చెప్తున్నారు. 
 
ఈ కారణంతోనే తన బిడ్డతో పాటు ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని.. తన వద్ద నుంచి కుమారుడిని దూరంగా తీసుకెళ్లడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయిందని స్నేహితులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.