సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (10:27 IST)

గదిలో ఐసిస్ జెండా పెట్టాలంటూ ట్రక్కుదాడి ఉగ్రవాది గోలగోల

న్యూయార్క్ నగరంలోని మ్యాన్‌హాట్టన్‌లో ట్రక్కుతో దాడికి తెగబడిన ఉగ్రవాది సైఫుల్లో సైపోవ్ ఓ వింత కోరిక కోరుతున్నారు. న్యూయార్క్ నగర పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ బుల్లెట్ కడుపులోకి దిగింది. దీంతో అతనికి

న్యూయార్క్ నగరంలోని మ్యాన్‌హాట్టన్‌లో ట్రక్కుతో దాడికి తెగబడిన ఉగ్రవాది సైఫుల్లో సైపోవ్ ఓ వింత కోరిక కోరుతున్నారు. న్యూయార్క్ నగర పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ బుల్లెట్ కడుపులోకి దిగింది. దీంతో అతనికి బెల్లెవ్యూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
అయితే, ఈ ఉగ్రవాది ఓ వింత కోరిక కోరుతున్నాడు. ఆసుపత్రిలోని తన గదిలో ఐసిస్ జెండా పెట్టాలంటూ వైద్యులతో అతను గొడవపడ్డాడు. తన ప్రాణాలు తీసినా పర్వాలేదని, ఐసిస్ జెండా మాత్రం తన ముందు కనపడాలని అతను డిమాండ్ చేశాడు. తాను చేసిన పని చాలా మంచిదని... ఇస్లామిక్ రాజ్యం వర్దిల్లాలంటూ నినాదాలు కూడా చేశాడు.
 
దీనిపై అధికారులు స్పందిస్తూ, ఉగ్రదాడి విషయంలో సైపోవ్‌లో ఎలాంటి పశ్చాత్తాపం కనబడలేదని చెప్పారు. వీలైనంత ఎక్కువ మందిని చంపడమే లక్ష్యంగా హాలోవీన్ డేను ఎంచుకున్నాడని తెలిపారు. యేడాది క్రితమే ఉగ్రదాడికి ప్రణాళిక రచించాడని... రెండు నెలల క్రితం ట్రక్కును అద్దెకు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఐసిస్‌కు సహకరించేందుకే ఉగ్రదాడికి పాల్పడ్డాడని చెప్పారు.