శనివారం, 1 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2016 (10:45 IST)

సరిహద్దుల్లో భారత్ - పాకిస్థాన్ సైన్యం మధ్య భీకర కాల్పులు.. 24 గంటలుగా...

సరిహద్దుల్లో భారత్, పాకిస్థాన్ సైన్యం మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ మరోమారు ఉల్లంఘించి యధేచ్చగా కాల్పులు జరపడంతో భారత సైన్యం కూడా ప్రతి కాల్పులకు దిగి ధీటుగా స

సరిహద్దుల్లో భారత్, పాకిస్థాన్ సైన్యం మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ మరోమారు ఉల్లంఘించి యధేచ్చగా కాల్పులు జరపడంతో భారత సైన్యం కూడా ప్రతి కాల్పులకు దిగి ధీటుగా సమాధానమిచ్చింది. 
 
జమ్ముకాశ్మీర్‌ ఆర్‌ఎస్‌పురా సెక్టార్‌లో పాక్‌ సైన్యం రాత్రి నుంచి కాల్పులకు తెగబడిన విషయం తెల్సిందే. ఈ కాల్పుల్లో 11 మంది పౌరులకు గాయాలు కాగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కాగా, పాకిస్థాన్ ఇప్పటికే పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంగతి తెలిసిందే.
 
మరోవైపు.. నౌషేరా, ఆర్‌ఎస్‌ పురా సెక్టార్లలోని భారత సైనిక పోస్టులపైనా, పౌర ఆవాసాలపైనా కాల్పులకు తెగబడింది. ధీటుగా స్పందించిన భారత జవాన్ల కాల్పుల్లో ఇద్దరు లేదా ముగ్గురు పాక్‌ రేంజర్లు హతమయ్యారు. ఎటువంటి కవ్వింపు చర్యలూ లేకుండానే మంగళవారం ఉదయం 10 గంటల నుంచి పాక్‌ సైన్యం కాల్పులు ప్రారంభించిందని ఓ ఆర్మీ అధికారి వెల్లడించారు.