మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 జూన్ 2021 (09:59 IST)

యెమెన్​లో హౌతీ ఉగ్రవాదుల దాడి.. 17మంది మృతి

యెమెన్​లో హౌతీ తీవ్రవాదులు జరిపిన క్షిపణి దాడిలో 17 మంది మృతిచెందారు. మరిబ్ నగరంలోని గ్యాస్ ప్లాంట్​ లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు.
 
యెమెన్​లో హౌతీ తీవ్రవాదులు జరిపిన క్షిపణి దాడిలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి సైతం ఉందని ఆ దేశ సైన్యాధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో గాయపడ్డట్లు పేర్కొన్నారు.
 
మరిబ్​ నగరంలోని మరిబ్ నగరంలోని గ్యాస్ ప్లాంట్​ లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు వివరించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా డ్రోన్ల సాయంతో అంబులెన్సులపైనా దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.