శుక్రవారం, 14 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (11:26 IST)

పాకిస్థాన్‌లో పరువు హత్య.. కోర్టులోనే కుమార్తెను చంపేశాడు..

crime scene
పాకిస్థాన్‌లో పరువు హత్యల సంఖ్య పెరిగిపోతోంది. తన ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్న కుమార్తెను ఓ తండ్రి కోర్టులోనే మట్టుబెట్టిన ఘటన కలకలం రేపింది. 
 
కరాచీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పిరాబాద్‌కు చెందిన యువతి తల్లిదండ్రులను ఎదిరించి తన ఇష్టపూర్వకంగా ఓ డాక్టర్ యువకుడిని వివాహం చేసుకుంది. 
 
ఈ క్రమంలో తన వాంగూల్మాన్ని నమోదు చేసేందుకు కరాచీ సిటీ కోర్టుకు హాజరైంది. వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు వచ్చిన సమయంలో ఆమె తండ్రి కాల్పులు జరిపాడని, తీవ్రంగా గాయపడిన యువతి కోర్టులోనే హాలులోనే మరణించినట్లు పోలీసులు తెలిపారు. 
 
వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.