మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (19:53 IST)

పేపర్ ‌లెస్ పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం కీలక నిర్ణయం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమవుతోంది. అయితే, ఈసారి బడ్జెట్ సమావేశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ ప్రతులను ముద్రించ కూడదని నిర్ణయించింది. పేపర్ లెస్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించబోతోంది. దీనికి ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభల ఆమోదం లభించింది. 
 
కరోనా కారణం గానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. బడ్జెట్ ప్రతులను ముద్రించేందుకు 100కు పైగా వ్యక్తులను 15 రోజుల పాటు ప్రింటింగ్ ప్రెస్‌లో ఉంచలేమని ఆర్థిక శాఖ వెల్లడించింది. 1947 తర్వాత మరోసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. 
 
కాగా, ఈ బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడతలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు.. రెండో విడతలో మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నారు. జనవరి 29 న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు.