గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 4 మే 2019 (09:12 IST)

హోటల్ బాత్రూమ్‌లో ఉరుగ్వేయన్ మాజీ అందాల రాణి శవం...

హోటల్ బాత్రూమ్‌లో మెక్సికో అందాల రాణి అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించారు. ఈ విషయాన్ని హోటల్ సిబ్బంది గుర్తించారు. ఆమె పేరు ఫాతిమివ్ డేవిలా. ఉరుగ్వేయన్‌ అందగత్తె. గురువారం మెక్సికోలోని ఓ హోటల్‌ బాత్‌రూమ్‌లో ఆమె చనిపోయి ఉండటాన్ని హోటల్‌ సిబ్బంది గుర్తించారు. 
 
ఉరుగ్వేయన్‌కు చెందిన 31 యేళ్ల ఫాతిమివ్‌ డేవిలా ఆ దేశం తరుపున మిస్‌ యూనివర్స్‌, మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొన్నారు. వృత్తిరీత్యా మోడల్‌ అయిన డేవిలా మెక్సికోలో నివాసముంటోంది. మోడలింగ్‌ విషయమై గత నెల 23న మెక్సికోలోని ఓ హోటల్‌లో ఆమె దిగారు. 
 
ఈనెల రెండో తేదీన హోటల్ గదికి వచ్చిన ఆమె అదే రోజు చనిపోయి ఉండటాన్ని సిబ్బంది గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెది ఆత్మహత్యా? లేక హత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.