శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (10:36 IST)

రష్యాలో కూలిన హెలికాఫ్టర్‌..13 మంది మృతి?

రష్యాలో గురువారం తెల్లవారుజామున హెలికాఫ్టర్‌ కూలిపోయింది. ఆ సమయంలో హెలికాఫ్టర్‌లో ముగ్గురు సిబ్బందితోపాటు 13 మంది ప్రయాణికులు ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది.

మి-8 హెలికాఫ్టర్‌ రష్యాలోని తూర్పున ఉన్న కమ్చట్కీ  ద్వీపకల్పంలోని కురిల్‌ సరస్సులో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ హెలికాఫ్టర్‌ పెట్రోపావ్లోన్స్‌ - కమ్చట్కీ నగరానికి సమీపంలో ఉన్న ఖోడుట్కా అగ్నిపర్వతాన్ని సందర్శించేందుకు పర్యాటకులను తీసుకువెళుతోంది.

సమాచారం అందుకున్న వెంటనే 40 మంది సహాయక బృందం అక్కడికి చేరుకుని.. తొమ్మిదిమందిని కాపాడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో ఏడుగురి కోసం గాలిస్తోందని.. సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు తెలిపింది.