1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2016 (08:55 IST)

డోనాల్డ్ ట్రంప్ మహా ముదురు.. వేదికపై నా వెంట కూడా పడ్డారు: హిల్లరీ క్లింటన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్‌పై వస్తున్న విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆయనపై ఇప్పటికే పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేయగా,

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్‌పై వస్తున్న విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆయనపై ఇప్పటికే పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేయగా, తాజాగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అయిన హిల్లరీ క్లింటన్ ఆ జాబితాలోకి చేరారు. 
 
తాజాగా ఆదివారం జరిగిన జాతీయస్థాయి టీవీ చర్చలో ట్రంప్‌ ప్రేమోన్మాదిగా తన వెంటబడ్డారనీ, మీదకొచ్చారని ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌ ఎన్‌బీసీ ఇంటర్వూలో చెప్పారు. అయితే ట్రంప్‌ ఈ ఆరోపణలను ఖండించారు. 
 
మరోవైపు అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. ఈ ఇద్దరు అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ఫలితంగా ఇద్దరు అభ్యర్థులు హద్దులు మీరుతున్నారు. రిపబ్లికన్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ మహిళల గురించి అవాకులు చెవాకులు పేలి ఇప్పటికే అప్రతిష్ఠపాలై రేటింగ్స్‌లో వెనుకబడిపోగా, హిల్లరీ క్లింటన్ మాత్రం దూసుకెళుతున్నారు.