సోమవారం, 21 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 ఏప్రియల్ 2025 (09:20 IST)

పాకిస్థాన్‌లో హిందూ మంత్రి కాన్వాయ్‌‍పై దాడి (Video)

attack on pak minister
పొరుగుదేశమైన పాకిస్థాన్‌లో హిందువులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. ఏకంగా ఆ దేశ మంత్రి కాన్వాయ్‌పైనే కొందరు అల్లరి మూకలు దాడి చేశాయి. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. 
 
పాకిస్థాన్‌లో హిందూనేత, మత వ్యవహారాల శాఖామంత్రిగా ఖేల్ దాస్ కోహిస్తానీ ఉన్నారు. ఆయన కాన్వాయ్‌పై కొందరు దుండగులు పాకిస్థాన్ నినాదాలు చేస్తూ దాడి చేశారు. సింధ్ రాష్ట్రంలోని నూతనగా కాల్వల నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ కాల్వల నిర్మాణం వల్ల తమకు నష్టం జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
 
దీంతో కొందురు ఆయన కాన్వాయ్‌పై కర్రలు, బంగాళాదుంపలు, టమోటాలు విసిరారు. కాగా, మంత్రి కాన్వాయ్‌పై జిగిన దాడిని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహ్రబాజ్ షరీఫ్ ఖండిస్తూ, ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఏకంగా మంత్రి కాన్వాయ్‌పైనే దుండగులు దాడికి తెగబడటం స్థానికంగా కలకలం సృష్టించింది. దీంతో పాకిస్థాన్‌లోని హిందూ ప్రజలు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు.