బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 జులై 2017 (14:38 IST)

నెం.1 కోటీశ్వరుడు.. బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టనున్న అమేజాన్ సీఈవో?

ప్రపంచంలోని కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బిల్‌గేట్స్‌ను అమేజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ వెనక్కి నెట్టనున్నట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్‌గేట్స్ గత నాలుగేళ్ల పాట

ప్రపంచంలోని కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బిల్‌గేట్స్‌ను అమేజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ వెనక్కి నెట్టనున్నట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్‌గేట్స్ గత నాలుగేళ్ల పాటు ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. బిల్ గేట్స్ ఆస్తుల విలువ  90.1 బిలియన్ డాలర్లు. 
 
ఈ నేపథ్యంలో అమేజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్.. ఇంకా మూడే వారాల్లో బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టి.. కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటారని ఫోర్బ్స్ అంచనా వేసింది. 
 
ప్రస్తుతం జెఫ్ బెజోస్ ఆస్తుల విలువ 88.2 అమెరికన్ డాలర్లు. ఇంకా రెండు వారాల్లో బిలియన్ డాలర్లు అధికమైతే.. ఈయన ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటారు.