గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జనవరి 2017 (10:53 IST)

బ్రెజిల్‌ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. జైలుకు నిప్పంటించారు.. 150మంది పరార్

బ్రెజిల్‌లోని రియోడిజనిరో జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఖైదీల మధ్య ఏర్పడిన ఘర్షణ చివరకు జైలుకు నిప్పు పెట్టే వరకు వెళ్లింది. ఇదే అదనుగా తీసుకున్న ఖైదీలు 150 మంది పరారయ్యారు. వివ

బ్రెజిల్‌లోని రియోడిజనిరో జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఖైదీల మధ్య ఏర్పడిన ఘర్షణ చివరకు జైలుకు నిప్పు పెట్టే వరకు వెళ్లింది. ఇదే అదనుగా తీసుకున్న ఖైదీలు 150 మంది పరారయ్యారు. వివరాల్లోకి వెళితే బ్రెజిల్‌లోని సావోపోలో రాష్ట్రంలోగల బౌరు జైలులో గత కొంతకాలంగా ఖైదీల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఇది కాస్త ముదిరిపోయి ఒకరిపై మరోకరు దాడులు చేసుకునే వరకు వచ్చింది. 
 
అనంతరం కొంతమంది ఖైదీలు జైలులోని కొన్ని విభాగాలకు నిప్పు పెట్టారు. అనంతరం దాదాపు 150 మంది ఖైదీలు పారిపోయారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇప్పటికే పారిపోయిన 150 మంది ఖైదీల్లో 100 మందిని పట్టుకున్నట్లు జైళ్లశాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే జైలులో కఠినమైన క్రమశిక్షణను అమలు చేస్తున్నారని, దీనిమూలంగానే ఖైదీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఒకరిపై మరోకరు దాడులు చేసుకున్నారని వారు అంటున్నారు.