బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2017 (15:05 IST)

మైక్రోవేవ్‌లో తల దూర్చాడు.. గాలి ఆడలేదు.. ఆపై (వీడియో)

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో సెల్ఫీలు, కొత్త ప్రయోగాలతో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సెల్ఫీలకు ఫోజిచ్చి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అలాగే కొత్త ప్రయోగాలు చేసి వాట

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో సెల్ఫీలు, కొత్త ప్రయోగాలతో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సెల్ఫీలకు ఫోజిచ్చి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అలాగే కొత్త ప్రయోగాలు చేసి వాటిని వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్టు చేసే పద్ధతిని చాలామంది అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో యూట్యూబ్ వీడియో కోసం ఓ వ్యక్తి ప్రాణాలతో చెలగాటం ఆడాడు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం చేశాడంటే.. మైక్రోవేవ్‌లో సిమెంట్ వేసి అందులో తల దూర్చేశాడు. లండ‌న్‌కి చెందిన జే స్వింగ్ల‌ర్‌ అనే వ్యక్తి ఈ సాహసానికి ఒడిగట్టాడు. ఇతడు సాధారణంగానే ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతూ రూపొందించిన వీడియోల‌ను యూట్యూబ్‌లో పెడుతుంటాడు. కానీ ఇటీవ‌ల ఓ వీడియో చేస్తుండ‌గా నిజంగానే అత‌ని ప్రాణాల మీదికి వ‌చ్చింది.
 
మైక్రోవేవ్‌ ఓవెన్‌లో పాలీ ఫిల్లా అనే సిమెంట్ వేసి, త‌ల‌కు గాలిపైపు త‌గిలించిన‌ పాలిథీన్ క‌వ‌ర్ పెట్టుకుని అందులో దూర్చాడు. సిమెంట్ గ‌ట్టిప‌డ‌టం కోసం బ‌య‌టి నుంచి హెయిర్ డ్ర‌య్య‌ర్‌ను ఉప‌యోగించారు. ప‌ది నిమిషాల త‌ర్వాత సిమెంట్ గ‌ట్టిప‌డింది.