శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (09:48 IST)

పాక్‌తో 10 రోజులు.. చైనాతో 15 రోజుల యుద్ధానికి రెడీ కండి: ఐఏఎఫ్ చీఫ్

పాకిస్థాన్‌తో పది రోజుల యుద్ధం.. చైనాతో 15 రోజుల యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) తన కమాండర్లను ఆదేశించింది. ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందిని, యుద్ధవిమానాలను పూర్తిస్థాయిలో ఆయుధా

పాకిస్థాన్‌తో పది రోజుల యుద్ధం.. చైనాతో 15 రోజుల యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) తన కమాండర్లను ఆదేశించింది. ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందిని, యుద్ధవిమానాలను పూర్తిస్థాయిలో ఆయుధాలు, క్షిపణులు, అలర్ట్‌ రాడర్‌ వ్యవస్థతో సర్వసన్నద్ధంగా ఉంచాలని ఇప్పటికే సూచనలు అందాయి. ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో ఐఏఎఫ్‌ చీఫ్‌ బీఎస్‌ ధనోవా కమాండర్లకు యుద్ధానికి సిద్ధం కావాల్సిందిగా సంకేతాలు ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
అలాగే పాకిస్థాన్‌తో పదిరోజుల పాటు చైనాతో 15 రోజుల పాటు యుద్ధం వస్తే ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని.. ధనోవా ఆదేశించినట్లు సమాచారం. అత్యంత చురుకైన సన్నద్ధతతో, పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచించారని మీడియా వర్గాల సమాచారం.