ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (09:11 IST)

ఇమ్రాన్ ఖాన్ రేప్‌లు చేయడంలో ఆరితేరాడు... : మాజీ భార్య

‌పాకిస్థాన్ మాజీ క్రికెటర్, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌‌ ఇటీవలే ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆయనపై రెండో మాజీ భార్య రేహమ్‌ ఖాన్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస

‌పాకిస్థాన్ మాజీ క్రికెటర్, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌‌ ఇటీవలే ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆయనపై రెండో మాజీ భార్య రేహమ్‌ ఖాన్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. 
 
ఇమ్రాన్‌ ఖాన్ మూడో వివాహంపై ఆమె స్పందిస్తూ, ఇమ్రాన్  పచ్చి మోసగాడని, వివాహేతర సంబంధాల్లో ఆరితేరాడని ఆరోపించింది. తాను భార్యగా ఉన్నప్పుడే అతనికి బుష్రాతో వివాహేతర సంబంధం ఉండేదని తెలిపింది. తన ముందే ఇమ్రాన్ ఆమెతో చనువుగా ఉండేవాడని వెల్లడించింది. అందుకే పెళ్లయ్యాక 10 నెలలు తిరక్కుండానే అతనికి విడాకులు ఇచ్చేశానని వాపోయింది. 
 
తామిద్దరం వివాహం చేసుకున్న రెండు నెలల తర్వాత ఆ ఫొటోలు, ప్రకటనను మీడియాకు ఇచ్చారని, అలాగే, ఇపుడు ఇమ్రాన్ మూడో పెళ్లి నెల క్రితమే జరిగిందనీ ఆమె వ్యాఖ్యానించింది. ఇమ్రాన్‌ ఖాన్‌లాంటి నీతిమాలిన వ్యక్తిని తన జీవితంలో ఇంతవరకు చూడలేదని రేహమ్‌ ఖాన్ పేర్కొంది.