సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (22:27 IST)

అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ క్లీన్‌బౌల్డ్ .. కొత్త ప్రధానిగా...

Imran Khan
పాకిస్థాన్ ప్రధామంత్రి ఇమ్రాన్ ఖాన్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఇమ్రాన్ సర్కారుపై ఆ దేశ జాతీయ అసెంబ్లీలో శనివారం రాత్రి జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా 174 మంది సభ్యులు ఓట్లు వేశారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, అవిశ్వాస తీర్మానానికి ముందే ఇమ్రాన్ ఖాన్ తన అధికార నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. 
 
342 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ సర్కార్‍‌పై సుప్రీంకోర్టు ఆదేశం మేరకు అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ జరిగింది. ఇందులో 174 మంది ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఫలితంగా ఇమ్రాన్ పదవిని కోల్పోయారు. 
 
అదేసమయంలో పాకిస్థాన్ దేశ చరిత్రలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొని పదవిని కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ చరిత్రకెక్కాడు. ఇమ్రాన్ ఖాన్ స్థానంలో ఇపుడు మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సోదరుడు, పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ పార్టీ అధినేత షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టనున్నారు.