శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 జులై 2017 (15:27 IST)

గర్భిణీ స్కానింగ్ కోసం వెళితే స్పోర్ట్స్ కారు బయటపడింది...

సాధారణంగా ఒక మహిళ గర్భందాల్చిన కడపులో బిడ్డ ఎలా ఉందన్న విషయంపై వైద్యులు స్కానింగ్ చేస్తుంటారు. అలా ఓ గర్భిణీ కడుపును స్కానింగ్ చేయగా ఆమె కడుపులో స్పోర్ట్స్ కారు బయటపడింది. దీంతో ఆ గర్భిణీతో పాటు ఆమె భ

సాధారణంగా ఒక మహిళ గర్భందాల్చిన కడపులో బిడ్డ ఎలా ఉందన్న విషయంపై వైద్యులు స్కానింగ్ చేస్తుంటారు. అలా ఓ గర్భిణీ కడుపును స్కానింగ్ చేయగా ఆమె కడుపులో స్పోర్ట్స్ కారు బయటపడింది. దీంతో ఆ గర్భిణీతో పాటు ఆమె భర్త హడలిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
లండన్‌కు చెందిన ఓ వ్యక్తి... గర్భంతో ఉన్న తన భార్యను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాడు. అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో స్పోర్ట్ప్ కారు లాంటి ఆకారం కనిపించింది. దీనిని చూడగానే భార్యాభర్తలిద్దరూ కెవ్వుమన్నారు. ఇలా జరిగిందేంటబ్బా అనుకుంటూ వెంటనే డాక్టర్‌ను అడిగారు. అతను స్కానింగ్ రిపోర్టును పరిశీలనగా చూసి అటువంటిదేమీ లేదని తేల్చిచెప్పారు. 
 
ఎదుగుతున్న శిశువు ఆ విధంగా కనిపిస్తున్నదని వివరించారు. ఈ స్కానింగ్ రిపోర్టును సదరు డాక్టర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పడది వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిని చూసి నవ్వుకుంటూ తమకు తోచిన కామెంట్లు పెడుతున్నారు.