గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (13:08 IST)

డ్రాగన్ కంట్రీ తీరు మారదా? మళ్లీ భారత భూభాగంపైకి చొచ్చుకొని..?

India-China
డ్రాగన్ కంట్రీ తీరు మారలేదు. మళ్లీ భారత భూభాగంపైకి చొచ్చుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు వాస్తవాధీన రేఖను దాటుకుని భారత భూభాగంపైకి దూసుకుని రావడానికి ప్రయత్నించారు. అయితే మనదేశ జవాన్లు వారిని అడ్డుకున్నారు. ఈ పరిణామాలతో లఢక్ ఈశాన్య ప్రాంతం సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ వాతావరణం నెలకొంటోంది. 
 
చైనా వైఖరి వల్ల ఇప్పటిదాకా నెలకొన్న వాతావరణం ఉద్రిక్తంగా మారిందని అధికారులు తెలిపారు. శాంతియుతంగానే సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని, అయినప్పటికీ.. చైనా దురుద్దేశంతో దాడులకు పాల్పడుతోందని మనదేశ ఆర్మీ అధికారులు చెబుతున్నారు.
 
సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు, రెండు దేశాల సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపూర్వక వాతావరణాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించారు. ఈ నెల 29, 30 తేదీల్లో రాత్రి వేళ ఈ ఘటనలు చోటుచేసుకున్నట్లు నిర్ధారించారు. శని, ఆదివారాల్లో ఛుసుల్ బోర్డర్ ఆఫీసర్స్ మీటింగ్ పాయింట్ సమీపంలో వాస్తవాధీన రేఖ వెంబడి ప్యాంగ్యాంగ్‌ట్సో సరస్సుకు దక్షిణ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.