శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2017 (11:04 IST)

ఇజ్రాయేల్ రాజధాని జెరూసలెం: భారత్ ప్రకటన ఇదే

ఇక నుంచి ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను అమెరికా గుర్తించనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దశాబ్ధాలుగా ఉన్న అమెరికా విధానంతో పాటు ప్రజా ఆకాంక్షలు.. ఆ ప్రాంతంలోని మిత్రదేశాల హెచ్చరి

ఇక నుంచి ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను అమెరికా గుర్తించనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దశాబ్ధాలుగా ఉన్న అమెరికా విధానంతో పాటు ప్రజా ఆకాంక్షలు.. ఆ ప్రాంతంలోని మిత్రదేశాల హెచ్చరికలను ట్రంప్ పక్కన పెట్టేశారు. ఈ ప్రక్రియకు కనీసం మూడు నుంచి నాలుగేళ్లు పడుతుందని అధికారులు చెప్తున్నారు. 
 
ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో ముందు జాగ్రత్త చర్యగా విదేశాలకు వెళ్లే అమెరికా పౌరులకు జాగ్రత్తగా ఉండాల్సిందిగా అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా డొనాల్డ్ ట్రంప్ జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా అధికారికంగా గుర్తించడంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ భారత్ తరపున ప్రకటన చేశారు. 
 
పాలస్తీనా విషయంలో తాము తీసుకునే నిర్ణయాలు స్వతంత్రంగా, స్థిరంగా ఉంటాయని భారత్ స్పష్టం చేసింది. భారత్ తన అభిప్రాయాలు, ఆసక్తులకు అనుగుణంగానే ఉంటుందని.. దీన్ని ఏ మూడో దేశం నిర్ణయించబోదని తేల్చి చెప్పారు. కాగా, అమెరికా చేసిన ప్ర‌క‌ట‌న‌ను అర‌బ్ దేశాలు వ్య‌తిరేకిస్తున్నాయి. మ‌రోవైపు టెల్‌ అవివ్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు తరలించేందుకు అమెరికా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది.