శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2017 (09:58 IST)

ఆస్ట్రేలియాలో భార్యను వేధించాడు.. హైదరాబాదులో అరెస్టయ్యాడు..

విదేశాల్లో ఉద్యోగం చేసే ఓ వ్యక్తి డబ్బుకు కక్కుర్తి పడి కట్టుకున్న భార్యనే అదనపు కట్నం కోసం వేధించాడు. చివరికి ఆస్ట్రేలియాలో భార్యను వేధించిన వ్యక్తి హైదరాబాదులో విమానం దిగగానే అరెస్టయ్యాడు. వివరాల్ల

విదేశాల్లో ఉద్యోగం చేసే ఓ వ్యక్తి డబ్బుకు కక్కుర్తి పడి కట్టుకున్న భార్యనే అదనపు కట్నం కోసం వేధించాడు. చివరికి ఆస్ట్రేలియాలో భార్యను వేధించిన  వ్యక్తి హైదరాబాదులో విమానం దిగగానే అరెస్టయ్యాడు. వివరాల్లోకి వెళితే... సికింద్రాబాద్ మౌలాలి గోపాల్ నగర్‌కు చెందిన రాజేందర్ తన కుమార్తె ఇంద్రజ (28)ను నెల్లూరు, మాలాపేటకు చెందిన పి.భరత్ తేజ (33)కు ఇచ్చి జనవరి 24, 2015లో వివాహం చేశారు. 
 
భరత్ విదేశాల్లో పనిచేయడం ద్వారా ఇంద్రజ తల్లిదండ్రులు అడిగినంత కట్నం ఇచ్చేశారు. కానీ పెళ్లైన కొన్ని రోజులకే భరత్ అదనపు కట్నం కోసం ఇంద్రజను వేధించడం మొదలెట్టాడు. దీంతో ఇంద్రజ హైదరాబాద్ వచ్చేసింది. అంతటితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా నుంచి వస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన భరత్‌ను అరెస్ట్ చేశారు. కాగా భరత్ తేజ ఆస్ట్రేలియాలోని మేరీ బోర్గ్ నగరంలో ట్రూఫుడ్స్ కంపెనీలో హెల్త్ సేఫ్టీ విభాగంలో పనిచేస్తున్నాడు.