ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (18:27 IST)

'శ్రీనగర్‌లో చుక్క రక్తం చిందినా, అక్కడ రక్తం ఏరులై పారుతుంది': పాక్ మంత్రి హెచ్చరిక

పాకిస్థాన్ సమాచార శాఖామంత్రి పర్వైజ్ రషీద్ భారత్‌ను హెచ్చరించారు. 'శ్రీనగర్‌లో చుక్క రక్తం చిందినా, అక్కడ రక్తం ఏరులై పారుతుంది' అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్‌లో అశాంతి కొనసాగినంత కాలం ఢిల్లీల

పాకిస్థాన్ సమాచార శాఖామంత్రి పర్వైజ్ రషీద్ భారత్‌ను హెచ్చరించారు. 'శ్రీనగర్‌లో చుక్క రక్తం చిందినా, అక్కడ రక్తం ఏరులై పారుతుంది' అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్‌లో అశాంతి కొనసాగినంత కాలం ఢిల్లీలో శాంతి ఉండబోదని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. 
 
యురీ ఘటన తర్వాత పాకిస్థాన్‌ను ఏకాకిని చేయాలన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై రషీద్ స్పందించారు. క్రూరత్వం మాత్రమే ఏకాకి అవుతుందన్న ఆయన కాశ్మీరీలను హింసిస్తున్న భారత్ మాత్రమే ఒంటరిగా మిగులుతుందని జోస్యం చెప్పారు. శ్రీనగర్‌లో చుక్క రక్తం చిందినా, అక్కడ రక్తం ఏరులై పారుతుందని దీనికి భారతే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
 
తమ దేశంలో పేదరికం, నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. యూరోప్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్(ఏఎస్ఈఏఎన్)నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. భారత్‌తో చర్చల కోసం తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.