గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2017 (14:57 IST)

భారతీయ సైనికులను చంపేశాం.. హఫీజ్ :: ఉత్తుత్తిదేనన్న భారత్

భారత సైనికుల్లో 30 మందిని హత్య చేశామంటూ ఉగ్ర సంస్థ జమాత్‌ ఉద్‌దవా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ ప్రకటించాడు. ఈ మేరకు ఒక ఆడియో టేప్‌ని విడుదల చేశాడు. దీనిపై భారత్ స్పందించింది. ఈ ఆడియోలో చేసిన ప్రకటన ఉత్

భారత సైనికుల్లో 30 మందిని హత్య చేశామంటూ ఉగ్ర సంస్థ జమాత్‌ ఉద్‌దవా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ ప్రకటించాడు. ఈ మేరకు ఒక ఆడియో టేప్‌ని విడుదల చేశాడు. దీనిపై భారత్ స్పందించింది. ఈ ఆడియోలో చేసిన ప్రకటన ఉత్తుత్తిదేనని పేర్కొంది. 
 
యూరీ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర తండాలపై సర్జికల్ స్ట్రైక్ జరిపి భారీ సంఖ్యలో తీవ్రవాదులను మట్టుబెట్టిన విషయంతెల్సిందే. ఈ దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అంతేనా పాకిస్థాన్‌తో పాటు ఉగ్ర సంస్థలు రగిలిపోయాయి. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని వివిధ రకాల ప్లానులు వేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో హఫీజ్ సయీద్ ఓ ప్రకటన చేశారు. పాకిస్థాన్‌లో భారత్‌ జరిపిన లక్షిత దాడులకు నిరసనగా తాము కూడా సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేశామన్నారు. ఈ దాడిలో 30 మంది భారత సైనికులు మృతిచెందారన్నారు. ఈ మేరకు ఒక ఆడియో టేప్‌ని విడుదల చేశాడు. అయితే అటువంటివి ఏం జరగలేదని, సైనికులు ఎవరూ మృతిచెందలేదని, ముగ్గురు కార్మికులు మాత్రమే మృతిచెందారని భారత సైన్యం స్పష్టం చేసింది.