శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 24 డిశెంబరు 2018 (13:12 IST)

ఇమ్రాన్ ఖాన్ ఇక ఆపండి.. భారత్‌ను చూసి నేర్చుకోండి... ఓవైసీ ఫైర్

పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్.. భారత మైనారిటీలపై నోరు విప్పడం వివాదాస్పదమైంది. ఒక సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. భారత్‌లో మైనారిటీలను ఇతర పౌరులతో సమానంగా చూడట్లేదన్నారు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే.. అది తిరుగుబాటుకు దారితీస్తుందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మజ్లిస్ అధినేత అసదుద్ధీన్ ఓవైసీ స్పందించారు. 
 
మైనారిటీలతో ఎలా మెలగాలో మోదీ ప్రభుత్వానికి చూపిస్తామని ఇమ్రాన్ చేసిన కామెంట్స్‌పై ఓవైసీ కౌంటరిచ్చారు. మైనారిటీల సంక్షేమం, రాజ్యాంగ హక్కుల విషయంలో భారతదేశాన్ని చూసి పాకిస్థాన్ చాలా నేర్చుకోవాలని సూచించారు. పాక్ రాజ్యాంగం ప్రకారం ముస్లిం వ్యక్తి మాత్రమే దేశ ప్రధాని కాగలడు, కానీ భారత్‌లో అన్నీ వర్గాల ప్రజలకు ఆ అవకాశం వుందని అసదుద్ధీన్ స్పష్టం చేశారు.