శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (09:11 IST)

సిరియాలో బాంబుల వర్షం.. 57మంది చిన్నారులతో సహా 200 మంది మృత్యువాత

ఉగ్రవాదులే లక్ష్యంగా సిరియా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ ఆపరేషన్‌లో 200 మంది పౌరులు బలైయ్యారు. ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను హతమార్చాలనే ఉద్దేశంతో సిరియా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. తూర్పు గౌటా

ఉగ్రవాదులే లక్ష్యంగా సిరియా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ ఆపరేషన్‌లో 200 మంది పౌరులు బలైయ్యారు. ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను హతమార్చాలనే ఉద్దేశంతో సిరియా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. తూర్పు గౌటాపై సైన్యం బాంబుల మోత మోగించింది. ఇందులో 200 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
 
కొన్నేళ్ల పాటు ఉగ్రవాదుల ఆధీనంలోని తూర్పు గౌటా ప్రాంతంలో విరుచుకుపడిన సైన్యం విచక్షణా రహితంగా బాంబులు పేల్చింది. ఈ బాంబుల మోతలో 57మంది చిన్నారుల పాటు 200 మంది మృత్యువాతపడ్డారు. 
 
మరో 300 మందికి గాయాలయ్యానని మానవ హక్కుల పరిశీలనా సంస్థ పేర్కొంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా వుందని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గౌటాలో దాదాపు నాలుగు లక్షల మంది నివాసం వుంటున్నారు. అలాంటి ప్రదేశంలో సైన్యం బాంబుల మోత మోగించడంపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.