అమెరికాలో ఇండియన్ టెక్కీలకు ట్రంప్ షాక్... రూ.87,00,000 జీతం వుంటేనే... లేదంటే పొండి...
డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్లే అమెరికాలోని ఎన్నారైలను ఖాళీ చేయించే దిశగా అడుగులు వేస్తున్నారు. హెచ్1 బి వీసాలతో అమెరికాలో ఉద్యోగం చేసేవారి వార్షిక వేతనం రూ. 87,00,000 వుంటేనే అమెరికాలో వుండేట్లు చట్టం తీసుకురాబోతున్నారు. ఈ బిల్లు దాదాపు ఆమోదం పొందే అవక
డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్లే అమెరికాలోని ఎన్నారైలను ఖాళీ చేయించే దిశగా అడుగులు వేస్తున్నారు. హెచ్1 బి వీసాలతో అమెరికాలో ఉద్యోగం చేసేవారి వార్షిక వేతనం రూ. 87,00,000 వుంటేనే అమెరికాలో వుండేట్లు చట్టం తీసుకురాబోతున్నారు. ఈ బిల్లు దాదాపు ఆమోదం పొందే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే అక్కడ నివాసముంటున్న ఎన్నారైలకు పెద్ద దెబ్బే. అంతా ఇండియాకు తిరుగు ప్రయాణం కట్టాల్సి వుంటుంది.
అమెరికాలో ఉద్యోగం, జీవితం అనేది వార్షిక వేతనం దాదాపు కోటి రూపాయల దాకా వున్నవారికే సాధ్యం. కాబట్టి అమెరికాలో అంత భారీ మొత్తంలో జీతాలు ఇస్తే దిగ్గజ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తదితర కంపెనీలు భారీ నష్టాలను చవిచూడక తప్పదు. ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయులకు శరాఘాతంగా మారుతుంది.
మరోవైపు ట్రంప్ తన నిర్ణయాన్ని ప్రకటించగానే భారత ఐటీ దిగ్గజ కంపెనీలు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా షేర్లు 9 శాతం మేర నష్టాలు చవిచూశాయి. ఇక మధ్యస్థాయి ఐటీ కంపెనీల షేర్లు దారుణంగా కుప్పకూలాయి. గమనించాల్సిన విషయం ఏమంటే... బీఎస్ఈలో 4 శాతం నష్టంతో ఎక్కువ నష్టాన్ని మూటగట్టుకున్నది ఐటీ రంగం కావడం. మున్ముందు ట్రంప్ మరెన్ని షాకులిస్తారో వేచి చూడాల్సిందే.