శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (09:40 IST)

పెళ్లై ముగ్గురు పిల్లలున్నారు.. పాకిస్థాన్ వెళ్లి మతం మారి.. ప్రియుడిని పెళ్లాడింది..

పాకిస్థాన్‌లోని ''జాతా'' అనే పవిత్ర స్థలాన్ని ప్రతి ఏడాది భారత్‌లోని సిక్కులు సందర్శిస్తుంటారు. ఇలా జాతా తీర్థయాత్ర కోసం పంజాబ్ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లిన సిక్కు మహిళ మతం మారింది. అంతటితో ఆగకుండా ముస

పాకిస్థాన్‌లోని ''జాతా'' అనే పవిత్ర స్థలాన్ని ప్రతి ఏడాది భారత్‌లోని సిక్కులు సందర్శిస్తుంటారు. ఇలా జాతా తీర్థయాత్ర కోసం పంజాబ్ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లిన సిక్కు మహిళ మతం మారింది. అంతటితో ఆగకుండా ముస్లిం వ్యక్తిని పెళ్లాడింది.


పెళ్లై ముగ్గురు పిల్లలున్న మహిళ సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్ వ్యక్తిని ప్రేమించి.. యాత్ర పేరిట జాతాకు వెళ్లి.. మతం మారి ప్రియుడిని వివాహం చేసుకోవడంపై భారత అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన కోడల్ని భారత్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సిక్కు మహిళ మామయ్య విదేశాంగ శాఖను విజ్ఞప్తి చేశారు. 
 
వివరాల్లోకి వెళితే హోషియాపూర్‌లోని గర్‌శంకర్ పట్టణానికి చెందిన కిరణ్ బాల (31)కు ఇది వరకే వివాహమైంది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏడాదిన్నర క్రితం తనకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన లాహోర్‌కు చెందిన మొహమ్మద్ ఆజంను పెళ్లాడేందుకు తన ముగ్గురు పిల్లలను మామయ్య వద్ద వదిలేసి పాకిస్థాన్ చేరుకుంది. అక్కడ మతం మార్చుకుని ప్రియుడిని పెళ్లాడింది. ఈ ఘటనపై గురుద్వారా నిర్వహణ కమిటీ మండిపడింది. ఇది ముమ్మాటికీ భారత ఇంటెలిజెన్స్ అధికారుల తప్పిదమేనని శిరోమణి గురుద్వారా నిర్వహణ కమిటీ ఆరోపించింది.
 
ఈసారి జాతాకు 1800 మంది భారతీయులు వెళ్లారు. వీరిలో పాటు జాతా వెళ్లిన కిరణ్ ఇస్లాం మతం పుచ్చుకుని తన పేరును అమ్నా బీబీగా మార్చుకుంది. అయితే తన కోడలిని తిరిగి భారత్ రప్పించేందుకు సాయం చేయాల్సిందిగా ఆమె మామ, మాజీ మతపెద్ద తార్సెం సింగ్ విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్‌ను విజ్ఞప్తి చేశారు. తన కోడలు ఐఎస్ఐ మాయలో పడిందని వాపోయారు కానీ కిరణ్ బాల అలియాస్ అమ్నా బీబీ మాత్రం తనను ఎవ్వరూ బలవంతం పెట్టలేదని.. తన ఇష్ట ప్రకారమే మారానని చెప్పుకొచ్చింది.