మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జనవరి 2021 (19:39 IST)

జో-బైడెన్ ఫాలో అవుతున్న తొలి సెలబ్రిటీ క్రిస్సీ టైగెన్‌

Chrissy Teigen
అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన జో బైడెన్‌.. అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ఓ నటిని ఫాలో కావడం చర్చకు దారి తీసింది. విషయానికి వస్తే.. బైడెన్‌ సోషల్‌ మీడియా వేదిక ట్విట్టర్‌ ఖాతా నుంచి ఫాలో అవుతున్న జాబితాలో తాజాగా అమెరికన్ నటి క్రిస్సీ టైగెన్ చేరిపోయారు. 
 
ఇప్పటి వరకు ఆయన.. తన భార్య జిల్‌, యూఎస్‌ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌ సహా మొత్తం 11 మందినే ఫాలో అవుతుండగా.. ఆ సంఖ్య ఇప్పుడు 12కు చేరింది. దీంతో... యూఎస్ ప్రెసిడెంట్‌ ఫాలో అవుతున్న తొలి సెలబ్రిటీగా ఆమె రికార్డు కెక్కారు. 
 
అసలు ఆమెను బైడెన్ ఫాలో అవడానికి కారణం కూడా లేకపోలేదు. మోడల్, టెలివిజన్ స్టార్, రచయిత అయిన క్రిస్సీ టైగెన్... సోషల్‌ మీడియా వేదికగా కొత్త అధ్యక్షుడికి ఓ రిక్వెస్ట్‌ పెట్టారు. 
Joe Biden, Kamala Harris
 
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నాలుగేళ్లుగా తనను బ్లాక్‌ చేశాడని.. నన్ను ఫాలో అవ్వండి ఫ్లీజ్‌ అంటూ ఆమె విజ్ఞప్తి చేయగా.. ఆమె కోరికను వెంటనే నెరవేర్చారు బైడెన్.. ఆమె రిక్వెస్ట్‌ పెట్టిన రోజే ఆమెను ఫాలో అవ్వడం మొదలు పెట్టారు.