సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (22:43 IST)

పురాతన బైబిల్‌ సాక్షిగా జో బైడెన్ ప్రమాణం

అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. భారత కాలమానం ప్రకారం ఆయన బుధవారం రాత్రి 10.30 గంటలకు ప్రమాణం చేశారు. తన భార్య సమక్షంలో 125 యేళ్లనాటి పురాతన బైబిల్‌ సాక్షిగా ఆయన అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడుగా ప్రమాణం చేశారు.  
 
కాగా, వాషింగ్టన్‌ డీసీలోని క్యాపిటల్‌లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్‌ రాబర్ట్స్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనకు ముందు ఉపాధ్యాక్షురాలు కమలా హ్యారిస్‌ ప్రమాణం చేశారు. ఈ పట్టాభిషేక ఘట్టాన్ని తిలకించేందుకు ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ తమ భార్యలతో కలిసి తరలివచ్చారు. 
 
అయితే తాజా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. మరోవైపు ట్రంప్‌ వైఖరి, క్యాపిటల్‌పై ఆయన మద్దతుదారుల దాడి నేపథ్యంలో బైడెన్‌, కమలా ప్రమాణ స్వీకారానికి అమెరికా చరిత్రలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. లేడీ గగా జాతీయ గీతం ఆలపించగా, జెన్నిఫర్‌ లోపెజ్‌ తన పాటలతో అలరించారు.