మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (10:00 IST)

జో బైడెన్ ప్రమాణ స్వీకారం.. భద్రత కట్టుదిట్టం.. మరో భారతీయుడికి కీలక పదవి

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి రెండు రోజుల ముందు ఈ భవనాన్ని లాక్‌డౌన్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. యూఎస్ కాంగ్రెస్‌కు కేంద్రమైన క్యాపిటల్ భవనంపై ఈ ఏడాది జనవరి 6న ట్రంప్ అనుకూల మూకలు దాడి చేశాయి. ఈ దాడుల్లో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కేపిటల్ భవనం వద్ద జాతీయ భద్రతాదళ సభ్యులను పెద్ద ఎత్తున మోహరించడంతో కట్టుదిట్టమైన భద్రత కనిపిస్తోంది.
 
అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్ తన పాలకవర్గంలో ఇప్పటికే 20 మంది భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా మరో భారతీయుడిని కీలక పదవికి ఎంపిక చేశారు. భారతీయ అమెరికన్ రోహిత్ చోప్రాను కన్స్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో(సీఎఫ్‌పీబీ) చీఫ్‌గా నియమించారు. 
 
కాథ్లీన్ లౌరా క్రానింగర్ స్థానంలో రోహిత్ ఎంపికయ్యారు. ప్రస్తుతం రోహిత్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ కమిషనర్‌గా ఉన్నారు. 2018లో సెనేట్ ఆయనను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎంపిక చేయడం విశేషం. ఈ పదవిలో ఆయన చట్ట ఉల్లంఘనలకు పాల్పడే కంపెనీలను అదుపు చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇంతకుముందు ఆయన సీఎఫ్‌పీబీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా విధులు నిర్వహించారు. తాజాగా కీలక పరిపాలన స్థానాలకు పలువురిని నియమించిన బైడెన్.. రోహిత్‌కు సీఎఫ్‌పీబీ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు.
 
బుధవారం బైడెన్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా హింసాత్మక నిరసనలు చోటుచేసుకునే అవకాశాలున్నాయంటూ 50 రాష్ట్రాలు, కొలంబియా డిస్ట్రిక్ట్‌ను ఇప్పటికే అప్రమత్తం చేశారు. రాష్ట్రాల రాజధానుల్లో ట్రంప్ మద్దతుదారులు సాయుధ కవాతు నిర్వహించే అవకాశాలున్నాయంటూ ఎఫ్‌బీఐ అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది.