శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By sarath
Last Modified: బుధవారం, 31 మే 2017 (14:07 IST)

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి : 80 మంది మృతి, ౩౦౦ మందికి పైగా క్షతగాత్రులు

బుధవారం ఉదయం కాబూల్ లోని జంబఖ్ స్క్వేర్ వద్ద జర్మనీ దౌత్య కార్యాలయానికి సమీపాన ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 80 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. విస్ఫోటన తీవ్రతతో వందల మీటర్ల దూరంలోనున్న భవంతుల తలుపులను కిట

బుధవారం ఉదయం కాబూల్ లోని జంబఖ్ స్క్వేర్ వద్ద జర్మనీ దౌత్య కార్యాలయానికి సమీపాన ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 80 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. విస్ఫోటన తీవ్రతతో వందల మీటర్ల దూరంలోనున్న భవంతుల తలుపులను కిటికీలను బద్దలు చేస్తూ అందులోని ప్రజలను గాయపరిచింది. 
 
పేలుడు సంభవించిన చోటు నుండి వందల మీటర్ల దూరం వరకు నల్లటి పొగ దట్టంగా అల్లుకుంది. ఇప్పటివరకు ఏ తీవ్రవాద సంస్థ తామే ఈ పేలుడిని చేసినట్లు ప్రకటించలేదు. కానీ గత నెల తాలిబన్లు తాము విదేశీ బలగాలపై దృష్టి పెడుతున్నట్లు, ఆ కోణం లోనే తాము దాడులకు దిగబోతున్నట్లు ప్రకటించారు.