బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 జనవరి 2018 (09:02 IST)

కార్గిల్‌లో మైనస్ 18.8 డిగ్రీలు... హర్యానాలో చలిదెబ్బకు సెలవులు

భూతలస్వర్గంగా భావించే కాశ్మీర్‌లో తొలిసారి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కాశ్మీర్‌లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ సీజన్‌లోనే అత్యల్ప రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

భూతలస్వర్గంగా భావించే కాశ్మీర్‌లో తొలిసారి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కాశ్మీర్‌లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ సీజన్‌లోనే అత్యల్ప రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రికార్డుస్థాయిలో లఢక్ ప్రాంతం‌లో, కార్గిల్‌లో మైనస్ 18.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 
శ్రీనగర్‌లో శనివారం మైనస్ 1.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా, ఒక్కరోజులోనే ఐదు డిగ్రీలు పతనమైంది. కాశ్మీర్‌లోని మిగతా పట్టణాలు గుల్‌మార్గ్ (మైసన్ 9.4), ఖాజీగుండ్, కుప్వారా (మైనస్ 4.6), కోకర్నాగ్ (మైనస్ 4.4)ల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు కొత్త రికార్డుల్ని నెలకొల్పాయి. 
 
హిమాచల్ ప్రదేశ్‌లోని కొండప్రాంతం కేలాంగ్‌లో మైనస్ 12.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీతోపాటు పంజాబ్, హర్యానా, పలు రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా 39 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరో 50 రైళ్లు ఆలస్యంగా నడుపుతుండగా, 16 రైళ్లను వాయిదా వేసినట్లు తెలిపారు. అలాగే, చలి తీవ్రత అధికంగా ఉండటంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అదేసమయంలో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కాస్తంత మెరుగుపడుతున్నాయి.