1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2016 (14:06 IST)

బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ 'టాప్ లెస్' ఫొటోలు.. జర్నలిస్టులకు బిగిస్తున్న ఉచ్చు!

బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ ‌టాప్‌లెస్ ఫోటోల వ్యవహారంలో ఆరుగురు జర్నలిస్టులు చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. యువరాణి టాప్‌లెస్ ఫోటోలను అత్యంత రహస్యంగా తీయడమే కాకుండా, వాటిని తమ మ్యాగజైన్ కవర్ ప

బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ ‌టాప్‌లెస్ ఫోటోల వ్యవహారంలో ఆరుగురు జర్నలిస్టులు చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. యువరాణి టాప్‌లెస్ ఫోటోలను అత్యంత రహస్యంగా తీయడమే కాకుండా, వాటిని తమ మ్యాగజైన్ కవర్ పేజీపై ముద్రించి ప్రచురించడాన్ని ఫ్రెంచ్ కోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఫోటోలను ప్రచురించి బ్రిటన్ రాచకుటుంబం పరువు తీశారని కేట్ మిడిల్టన్ న్యాయవాదుల ప్రధాన వాదనగా ఉంది. దీంతో, ఆరుగురు జర్నలిస్టులపై విచారణకు కోర్టు సిద్ధమైంది. ఈ కేసు విచారణ వచ్చే జనవరి నుంచి విచారణ జరుగుతుందని ఫ్రెంచ్ న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... 2012లో ప్రిన్స్ విలియమ్స్, ప్రిన్సెస్ (డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్) కేట్ మిడిల్టన్‌లు హాలిడే కోసం దక్షిణ ఫ్రాన్స్‌లోని ఓ ప్రాంతానికి వెళ్లారు. మూడో మనిషి కూడా అడుగుపెట్టలేని ఆ భవంతి పోర్టికోలో వీరిద్దరూ చనువుగా ఉన్న సమయంలో క్లోజర్ మేగజీన్‌కు చెందిన జర్నలిస్టులు రహస్యంగా ఫొటోలు తీశారు. జూమ్ కెమెరాతో కేట్ మిడిల్టన్ టాప్‌లెస్ ఫొటోలను కెమెరాలో బంధించారు. 
 
ఆ తర్వాత ఆ ఫొటోలను కవర్ పేజ్‌పై ముద్రించి మ్యాగజైన్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. దీనిపై బ్రిటన్ రాచకుటుంబం భగ్గుమంది. ఫ్రెంచ్ ఉన్నతాధికారులతో మాట్లాడి, సదరు మ్యాగజైన్‌పై దావా వేసింది. ఈ నేపథ్యంలోనాలుగేళ్ల విచారణ అనంతరం, మ్యాగజైన్ ఎడిటర్, ఓ సీనియర్ జర్నలిస్ట్, ఇద్దరు ఫొటో జర్నలిస్టులు, మరో ఇద్దరు ఫ్రీలాన్స్ ఫొటో జర్నలిస్టులపై విచారణకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో నిందారోపణలు రుజువైతే ఆరుగురు జర్నలిస్టులకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉన్నట్టు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.