1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (10:02 IST)

అమెరికాకు కిమ్ స్ట్రాంగ్.. యుద్ధాన్ని నివారించడం లక్ష్యం..

ఉత్తర కొరియా సైన్యం 90వ వార్షికోత్సవం రాజధాని ప్యాంగ్యాంగ్‌ను భారీ ఎత్తున జరుపుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో తమ అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శించారు. ఇందులో భారీ అణ్వాయుధాలు, క్షిపణులు ఉన్నాయి. వేలాది మంది ప్రజలు జయజయధ్వానాలతో కిమ్‌కు సంఘీభావం తెలిపారు.
 
తమ దేశం ఆంక్షల నుంచి మినహాయింపులు పొందడమే లక్ష్యంగా అణు పరీక్షలు కొనసాగిస్తోందని కిమ్‌ పరేడ్‌ను ఉద్దేశించి స్పష్టం చేశారు. తమ మొదటి మిషన్‌ అణ్వాయుధ బలగాల ప్రాథమిక లక్ష్యం యుద్ధాన్ని నివారించడమేనన్నారు.
 
అనివార్యం అయితే రెండో మిషన్‌గా అణ్వాయుధాలను ప్రయోగించడమేనని హెచ్చరించారు. మా ప్రయోజనాలకు అడ్డు తగిలితే శత్రువు అస్థిత్వాన్ని కోల్పోవాల్సిందేనని పరోక్షంగా అమెరికాను హెచ్చరించారు కిమ్‌.
 
ఈ పరేడ్‌లో ఖండాంతర క్షిపణి హ్వాసంగ్‌-17 ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ బాలిస్టిక్‌ క్షిపణి ఆరు వేల కిలో మీటర్ల దూరం ప్రయాణించి అమెరికాను తాక గలదని భావిస్తున్నారు.