అణ్వాయుధ ప్రయోగానికి సిద్ధమవుతున్న రష్యా - పుతిన్ ఆదేశం
తమ దేశ సైనిక బలగాలకు చుక్కలు చూపుతున్న ఉక్రెయిన్ పీచమణిచేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వస్త్ర ప్రయోగం చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టున్నారు. ఇందుకోసం ఆయన అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అణ్వస్త్ర నిరోధక విభాగాలు సర్వసన్నద్ధంగా ఉండాలంటూ ఆదేశారు జారీచేశారు.
నాటో దేశాలు దూకుడు ప్రదర్శిస్తుండటం, స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగించడం, కఠినమవుతున్న ఆర్థిక ఆంక్షలు, తమ విమానాలకు గగనతల నిషేధం విధించడం వంటి నిర్ణయాలు పుతిన్‌కు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా ఏకపక్ష దాడుల తర్వాత నాటో దశాల వైఖరి కఠినంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై సైనిక చర్య నేపథ్యంలో నాటో దేశాలు ప్రతీకార చర్యలకు దిగే అవకాశాలు ఉండటంతో వాటిని నియంత్రించేందుకు వీలుగా ఉక్రెయిన్‌పై అణ్వస్త్రాలను ప్రయోగించాలన్న భావనకు వచ్చినట్టు తెలుస్తుంది.
మరోవైపు, ఉక్రెయిన్, రష్యా దేశాలు శాంతిచర్చలకు అంగీకరించారు. ఈ చర్చలు బెలారస్ సరిహద్దుల వద్ద జరుగుతాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. అయితే, చెర్నోబిల్ ప్రాంతంలో ఈ శాంతి చర్చలు జరపాలని ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి.