ఆఫ్రికాలో భారీ మరకతం బయల్పడింది.. 1.505 కేజీల బరువు
ఆఫ్రికాలోని జాంబియా దేశంలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ముడి మరకతం బయటపడింది. దీని బరువు ఏకంగా 7,525 క్యారెట్లు (1.505 కేజీలు) కావడం విశేషం. ఇంత భారీ మరకతం కావడంతో ఇది అతిపెద్ద మరకతంగా గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టింది.
ఈ మరకతం పైభాగాన ఉబ్బెత్తుగా ఉండటంతో దీనికి 'చిపెంబెలె' అని పేరు పెట్టారు. గతంలోనూ ఇదే గనిలో కొన్ని భారీ మరకతాలు తవ్వకాల్లో బయటపడ్డాయి.