సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 నవంబరు 2022 (11:18 IST)

బీమా పాలసీ కోసం ఏడు నెలల గర్భిణీని చంపేశాడు.. దోషిగా నిర్ధారణ

Man
Man
బీమా పాలసీ కోసం ఓ వ్యక్తి ఏడు నెలల గర్భిణీ అయిన తన భార్యని 304 మీటర్ల రాతి కొండపై నుంచి తోసి చంపేశాడు. ఈ షాకింగ్‌ సంఘటన టర్కీలో జరిగింది. జూన్ 2018లో 41 ఏళ్ల హకన్ ఐసల్ తన ఏడు నెలల గర్భిణీ భార్య సెమ్రా ఐసల్ (32)ని దక్షిణ టర్కీలోని ముగ్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బటర్‌ఫ్లై వ్యాలీలోని ఒక కొండపై నుండి తీసుకువెళ్లాడు. ఈ కేసులో హకన్ ఐసల్ దోషి అని కోర్టు తీర్పునిచ్చిందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.
 
సెల్ఫీ తీసుకుంటాననే నెపంతో భార్యను 304 మీటర్ల కొండ అంచుకు తీసుకెళ్లాడు. అంత ఎత్తుపైకి వెళ్లేందుకు ముందుగా చాలా భయపడిపోయింది. అయితే భర్త తన పక్కనే ఉన్నాడనే ధైర్యంతో కొండ అంచు వరకు తనతోపాటు వెళ్లింది. కానీ, ఆమె నమ్మిన వ్యక్తి ఆమెను పాతాళంలోకి నెట్టి చంపేశాడు. 
 
ఆమెను హతమార్చిన తర్వాత హకన్ ఐసల్ 25 వేల యూఎస్ డాలర్ల బీమా సొమ్ము కోసం క్లెయిమ్ చేయడం అనుమానాలకు దారి తీసింది. జూన్ 2018లో ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపిన కోర్టు హకన్ ఐసల్‌ను దోషిగా నిర్ధారించింది.  
 
నా మానసిక స్థితి సరిగా లేదని, అందుకే నేను దోషిని కానని హకన్ ఐసల్ తీర్పును ప్రశ్నించారు. అయితే ఫోరెన్సిక్ మెడిసిన్ 4వ ప్రత్యేక విభాగం వైద్యులు ఆయన వాదనను తోసిపుచ్చారు. 
 
గత మంగళవారం, అక్టోబర్ 25, ఈ కేసులో తుది తీర్పు వెలువడింది. విడుదల కోసం పరిగణించబడే ముందు ఐసల్‌కు కనీసం 30 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని కోర్టు ఆదేశించింది.