శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 నవంబరు 2022 (15:32 IST)

కెన్యాలో తీవ్ర కరువు.. నీటి కొరతతో ఏనుగులు మృత్యువాత

Elephant
ఆఫ్రికా దేశమైన కెన్యాలో తీవ్ర కరువు కారణంగా ఏనుగులు తాగేందుకు నీరులేక మృత్యువాత పడుతున్నాయి. కెన్యా 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువును ఎదుర్కొంటోంది. దీంతో నీటి కొరతతో వివిధ జీవరాశులు మృత్యువాత పడుతున్నాయి. ఏనుగులు అధికంగా ఉండే కెన్యాలో ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాల్లో తీవ్ర కరువు కారణంగా ఆహారం, తాగడానికి నీరు లేక ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి.
 
దీనిపై కెన్యా పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 205 ఏనుగులు కరువుతో బాధపడుతున్నాయని తెలిపారు. కెన్యాలో కరువు కారణంగా ఏనుగులతో పాటు 14 రకాల జంతువులు చనిపోతున్నాయని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. కెన్యాలో వర్షపాతం క్రమంగా తగ్గుతోంది.
 
ముఖ్యంగా ఉత్తర కెన్యాలో వరుసగా 3వ సంవత్సరం అత్యల్ప వర్షపాతం నమోదైంది. పర్యాటక ప్రాంతాల్లో జంతువులకు నీరు, ఆహారం అందించేందుకు కెన్యా టూరిజం శాఖ ఏర్పాట్లు చేస్తోంది.