1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2022 (14:56 IST)

ప్రతి యువకుడు రెండు పెళ్లి చేసుకోవాల్సిందే.. లేదంటేనా...

marriage
సాధారణంగా వివాహ చట్టాలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి. మన దేశంలో బహు భార్యత్వం నిషేధం. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో వివాహం చేసుకోవానికి వీల్లేదు. కానీ, మన దేశంలోని కేరళ రాష్ట్రంలో మాత్రం దీనికి మినహాయింపు ఉంది. దీనికి కారణం ఆ రాష్ట్రంలో స్త్రీపురుష నిష్పత్తిలో తేడా ఉంది. అందుకే అక్కడ ఒక పురుషుడు రెండు మూడు పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు. మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం ఇది నిషేధం. అదేవిధంగా ఒక్కో దేశంలో ఒక్కో రకమైన చట్టాలు ఉన్నాయి. 
 
అయితే, ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో ఒకటైన ఎరిత్రియా దేశంలో ప్రతి పురుషుడు రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే. అలా చేసుకోకపోతే ఆ వ్యక్తిని జైలుకు పంపుతారు. ఈ దేశంలో రెండో పెళ్లి చేసుకోకపోతే చట్టరీత్యా నేరం. ఈ చట్టం ఒక్క పురుషుడుకు మాత్రమే కాదు స్త్రీలకు కూడా వర్తిస్తుంది. భర్త రెండో పెళ్లికి భార్య అడ్డు చెపితే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. 
 
అయితే, ఈ దేశంలో ఈ తరహా చట్టాన్ని అమలు చేయడానికి బలమైన కారణం లేకపోలేదు. ఈ దేశంలోని స్త్రీపురుష నిష్పత్తిలో ఎంతో తేడా వుంది. 1998 నుంచి 2000 మధ్య కాలంలో ఇథియోపియా నుంచి వేర్పాటు యుద్ధంలో లక్షలాది మంది పురుషులు చనిపోయారు. 
 
దీంతో దేశంలో పురుషుల కొరత ఏర్పడ్డాయి. అంటే దేశంలో పురుషుల శాత తగ్గి, స్త్రీ శాతం పెరిగింది. ఈ స్త్రీపురుష నిష్పత్తిని సమం చేసేందుకు వీలుగా ఎరిత్రియా దేశంలో ఈ రెండు పెళ్ళిళ్ళ చట్టాన్ని అమలు చేస్తుంది. అయితే, ఈ చట్టంపై అనేక విమర్శలు వచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం వెనుకంజ వేయలేదు.