శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (13:43 IST)

NCERT కీలక నిర్ణయం... బ్యాగు బరువు తగ్గించడమే లక్ష్యం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వొద్దని ఆదేశాలను జారీ చేసింది. ఇంకా.. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు సంబంధించి వర్క్ బుక్ లను స్కూల్స్ లోనే ఉంచాలని వెల్లడించింది. 
 
విద్యార్థుల బుక్స్ బ్యాగు బరువును తగ్గించడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు సంబంధించి మాథ్స్ కు ఒక నోట్ బుక్, మిగతా అన్ని సబ్జెక్టులకు సంబంధించి మరో నోట్ బుక్ మాత్రమే నిర్వహించాలంటూ స్పష్టం చేసింది. 
 
ఇంకా హైస్కూల్ కు సంబంధించి లాంగ్ నోట్ బుక్ ను రెండు సబ్జెక్టులకు కేటాయించుకునేలా విద్యార్థులకు పర్మిషన్ ఇవ్వాలని సూచించింది. ఇంకా ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టుల వివరాలను విద్యార్థులకు చెప్పి ఏ రోజుకు అవసరమైన పుస్తకాలు ఆ రోజే తీసుకువచ్చేలా చూడాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. 
 
పుస్తకాలను స్కూల్ లోనే దాచుకునే సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. ఏ తరగతి విద్యార్థులకు స్కూల్ బ్యాక్ ఎంత మేరకు బరువు ఉండాలనే అంశంపై సైతం స్పష్టత ఇచ్చారు.