శుక్రవారం, 14 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (17:11 IST)

కియారా అద్వానీ పెళ్లి కూతురు కాబోతోందా?

Kiara_Siddarth
హీరోయిన్ కియారా అద్వానీతో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న షాహిద్ కపూర్ సిద్ధార్థ మల్హోత్రా హీరోయిన్ కియారా అద్వానీ మధ్య బంధం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 
 
తాజాగా ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా అందులో సిద్ధార్థ గురించి కరణ్ ప్రశ్నిస్తుండగా షాహిద్ మాట్లాడుతూ.. ఈ ఏడాది అంటే డిసెంబర్ నెలలో అతిపెద్ద ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అది సినిమా గురించి మాత్రం కాదంటూ చెప్పుకొచ్చాడు.
 
ఇక దీంతో డిసెంబర్ నెలలో సిద్ధార్థ్, కియారా వివాహం చేసుకోబోతున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పాడని అందరూ అనుకుంటున్నారు. ఇక కైరా కూడా అతను ఎప్పుడూ నాకు ప్రత్యేకమే అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో కూడా నెట్టింట వైరల్‌గా మారింది.