సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జులై 2020 (11:24 IST)

దోషిగా తేలిన మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్

Malaysia Ex PM
మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ దోషిగా తేలారు. లక్షల డాలర్ల అవినీతి కేసులో.. ఆయనను దోషిగా తేల్చారు. మొత్తం ఏడు అభియోగాల్లో నజీబ్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

మనీలాండరింగ్‌, అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని నజీబ్ కోర్టుకు తెలిపారు. మలేషియా డెవలప్‌మెంట్ బెర్హాద్‌ (వన్ ఎండీబీ) ఫండ్ కేసులో భారీ అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 
 
మాజీ ప్రధాని నజీబ్ ఆ ఫండ్ నిధులను దుర్వినియోగం చేశారని కేసు నమోదైంది. ఆ ఫండ్ నుంచి సుమారు పది మిలియన్ల డాలర్ల అమౌంట్‌ను ప్రధాని ప్రైవేటు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

2009 నుంచి 2018 వరకు నజీబ్ మలేషియా ప్రధానిగా చేశారు. ఈ కేసులో మాజీ ప్రధాని నజీబ్‌కు 15 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశాలు ఉన్నాయి.