బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (18:16 IST)

శునకం మనిషిని కాల్చి చంపిందంటే నమ్ముతారా.. ?

Black Dogs
శునకం మనిషిని కాల్చి చంపిందంటే నమ్ముతారా.. అయితే పెంపుడు శునకాన్ని పెంచిన ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. పెంపుడు కుక్క పొరపాటున తుపాకీ పేల్చడంతో అతను దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. 30 ఏళ్ల ఓ వ్యక్తి పికప్ ట్రక్ వెనక సీట్లో యజమానికి చెందిన గన్ వుంది. డ్రైవింగ్ సీట్ లో వ్యక్తి కూర్చుని వున్నాడు. ట్రక్కులో వెళ్తుండగా ఆ శునకం, రైఫిల్ పై కాలు వేయడంతో అది పేలి.. అందులోని బుల్లెట్ దూసుకెళ్లి ముందు సీట్లో వున్న యజమాని వెన్నుకు తగిలింది. ఈ ఘటనలో శునకం యజమాని అక్కడిక్కడే మృతి చెందాడని అధికారులు తెలిపారు.